తెలుగమ్మాయి స్వాతి గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలైట్ గా వర్క్ చేస్తున్న వికాస్ ని ప్రేమిస్తోందనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కబోతున్నారు.
ఆగస్ట్ 30న రాత్రి 7.33 కి హైదరాబాద్ లో స్వాతి, వికాస్ పెళ్లి జరగనుంది. సెప్టెంబర్ 2న కొచ్చిలో రిసెన్షన్ ఏర్పాటు చేసారు. కాగా పెళ్లి తర్వాత స్వాతి సినిమాలు చేసే అవకాశంలేదు. ఎందుకంటే వికాస్ ఇండోనేషియాలో సెటిల్ అయిన వ్యక్తి. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి జాకర్తా, ఇండోనేషియాలో ఉండబోతోంది స్వాతి. సో... మన తెలుగు నటి పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేస్తోంది ఫిల్మ్ బజ్ డాట్ కామ్ ....!