నందమూరి కుటుంబానికి చెందిన హీరోలు కలిసి మెలిసి ఉండాలని, వారి మధ్య ఎలాంటి పొరపొచ్ఛాలు ఉండకూడదని నందమూరి అభిమానులు తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ను ఒకే వేదిక మీద చూడాలని కోరుకుంటారు. గతంంలో పలు సందర్భాల్లో ఈ బాబాయ్, అబ్బాయిని ఒకే వేదిక మీద చూశారు. అయితే చాలా కాలం నుంచి జాయింట్ దర్శనాలు కరువయ్యాయి. దానికి కారణాలు ఏవైనప్పటికీ నందమూరి హరికృష్ణ మరణం బాలయ్య, ఎన్టీఆర్ ను ఒకటయ్యేలా చేసిందని గత నాలుగు రోజులు నుంచి వార్తలు వింటూనే ఉంటున్నాం. ఈ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న వీడియోలను కూడా చూస్తున్నాం.
కాగా తాజాగా మరో వార్త వినబడుతోంది. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రం ఆడియో వేడుకకు బాలయ్యను ముఖ్య అతిథిగా తీసుకురావాలని భావిస్తున్నారట. మాములుగా ఎన్టీఆర్ ఆడియో వేడుకకు నందమూరి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో బాబాయ్ బాలకృష్ణను నిలబెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు ఇంతకంటే పండగలాంటి వార్త మరొకటి ఉండదని చెప్పొచ్చు.