మెగా కుటుంబం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ కీలక పాత్ర చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో నిహారిక ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది అనే ఆసక్తి అందరిలో ఉంది.
తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో నిహారిక పాత్ర నిడివి 10 నిముషాల పాటు ఉంటుందట. కథాకళి డ్యాన్సర్ గా కనువిందు చేయనుందని సమాచారమ్. ప్రస్తుతం కథాకళి డ్యాన్స్ కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుంటోందట. త్వరలోనే నిహారిక పాల్గొనగా ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరగనుందని తెలుస్తోంది. 10 నిముషాల రోల్ అయినప్పటికీ, స్టోరీతో లింక్ అయిన కీలక పాత్ర అని తెలుస్తోంది. డ్యాన్సర్ గా చక్కటి హావాభావాలను పలికించగల పాత్ర. అలాగే నటనకు స్కోప్ కూడా ఉంటుందట. సో.. నిహారికకు 'సైరా నరసింహారెడ్డి' ద్వారా చక్కటి పెర్ ఫామెన్స్ చూపించడానికి స్కోప్ దొరికిందని చెప్పొచ్చు. మరి ఈ అవకాశాన్ని మెగా డాటర్ ఎలా సద్వినియోగం చేసుకుంటుందో వేచిచూద్దాం.