అతిలోకసుందరి, లెజండరీ యాక్టరస్ శ్రీదేవి పాత్రను ఓ హీరోయిన్ చేస్తోందంటే, ఆమెపై అందరి దృష్టి పడుతుంది. శ్రీదేవి ని గుర్తుకు తెచ్చే విధంగా సదురు హీరోయిన్ లుక్ ఉంటుందా... శ్రీదేవి లా నటించగలుగుతుందా అనే చర్చ జనాల్లో జరుగుతుంది. కాబట్టి శ్రీదేవి పాత్ర చేయడమంటే ఛాలెంజ్ తో కూడుకున్న పని. తెలుగు ఆడియన్స్ ని మెప్పించేలా ఉండాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ప్రస్తుతం శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ ఓ ప్రెస్టేజియస్ సినిమా కోసం చేస్తోంది. ఈ రోజు (10.10.2018) శ్రీదేవి పాత్ర చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్ విడుదలయ్యింది. లుక్ అదిరిపోయేలా ఉంది. ఆ వివరాల్లోకి వెళితే...
మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్ - కథానాయకుడు' చిత్రంలో శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్ చేస్తోంది. ప్రస్తుతం బాలయ్య, రకుల్ పాల్గొనగా 'వేటగాడు' చిత్రంలోని 'ఆకుచాటు పిందె తడసె...' పాటను చిత్రీకరిస్తున్నారు. రకుల్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా 'ఎన్టీఆర్ - కథానాయకుడు' లోని రకుల్ లుక్ ని విడుదల చేసారు. ఈ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక శ్రీదేవి పాత్రలో ఆడియన్స్ ని కట్టిపడేసే విధంగా రకుల్ నటన ఉంటే... అమ్మడికి తెలుగు ప్రజల గుండెల్లో చోటు దక్కడం ఖాయం. చూద్దాం మరి.. శ్రీదేవి గా రకుల్ నటన ఎలా ఉంటుందో...!