'ఎగిరే పావురమా', 'ఉగాది', 'పవిత్ర ప్రేమ', 'మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి' సినిమాల ద్వారా తెలుగు ఆడియన్స్ మనసులను దోచుకున్న హీరోయిన్ లైలా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇరానియన్ బిజినెస్ మ్యాన్ మెహదీన్ ని పెళ్లి చేసుకుంది. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉన్న లైలా చిత్ర పరిశ్రమకు దూరమయ్యింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్ లో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంది. అదే చార్మింగ్, క్యూట్ నెస్, బబ్లీగా, గ్లామర్ గా ఉంది లైలా. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు... రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో లేరా అని లైలాని అడిగితే...
''సినిమాల్లో నటించాలనే ఆసక్తి నాలో ఉంది. అయితే మంచి క్యారెక్టర్స్ వస్తేనే చేస్తాను. ఓ సినిమా డైరెక్ట్ చేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాను'' అని చెప్పింది. ప్రస్తుతం అత్త, అమ్మ, వదిన పాత్రలు చేస్తున్నవారు గ్లామర్ గా ఉండాలి. నదియా, రమ్యకృష్ణ, మీనా లాంటి వారికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వీరు బాగానే డిమాండ్ చేసి పారితోషికం తీసుకుంటున్నారు. లైలాకి కూడా ఇలాంటి ఆఫర్స్ వస్తే, ఆమె రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగానే ఉంది. మరి లైలా రీ ఎంట్రీ ని ఏ దర్శక, నిర్మాతలు వర్కవుట్ చేసుకుంటారో వేచిచూద్దాం.