నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన 'సింహా', 'లెజెండ్' ఏ రేంజ్ విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు సినిమాల్లోనూ బాలయ్య రెండు పాత్రలు పోషించారు. ఈ రెండు పాత్రలను నందమూరి ఫ్యాన్స్ తో పాటు సినీప్రియులు బాగా ఎంజాయ్ చేసారు. ఓ రకంగా చెప్పాలంటే తమ కాంబినేషన్ లో హిట్ ఫార్ములా ఈ డుయెల్ రోల్ అని భావిస్తున్నాడట బోయపాటి. ఈ హిట్ ఫార్ములాని వదలకూడదని ఫిక్స్ అయ్యాడట.
కాగా తాజా వార్తల ప్రకారం బాలయ్యతో బోయపాటి చేయబోతున్న సినిమాలో కూడా బాలయ్య రెండు పాత్రల్లో అలరించనున్నారని సమాచారమ్. ఈ రెండు పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దాడట బోయపాటి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆల్ రెడీ స్ర్కిఫ్ట్ కూడా రెడీ అయ్యిందట. సో... బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ కొట్టడానికి సమాయత్తమవుతున్నాడని ఊహించవచ్చు. బాలయ్య అభిమానులకు డబుల్ ట్రీట్ గ్యారంటీ...!