స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న #RRR చిత్రం సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితిచోప్రాని హీరోయిన్ గా తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజంలేదని, కేవలం పుకార్లేనని మరో వార్త ప్రచారమవుతోంది.
పరిణితి చోప్రాని ఈ సినిమా కోసం కాంటాక్ట్ చేయలేదట. అయితే పరిణితి చోప్రా పి.ఆర్ టీం ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తోందట. తద్వారా పరిణితి గురించి వార్తలు హల్ చల్ చేస్తాయని, దానివల్ల పబ్లిసిటీ రావడంతో పాటు.. దర్శక, నిర్మాతల దృష్టిలో పరిణితి పడుతుందని, ఆమెకు ఏదైనా ఆఫర్ తగులుతుందేమోనని ఇలాంటి ప్రచారాలకు తెర తీస్తుంటారట. ఎలాంటి ఆఫర్ రాకపోతే, ఆమె ఆ సినిమాను వదిలేసుకుందనే వార్తలు ప్రచారం చేస్తారట. ఈ పబ్లిసిటీ లో భాగంగానే #RRR సినిమా కోసం పరిణితి చోప్రాని కాంటాక్ట్ చేసారనే వార్తలు ప్రచారమయ్యామని తెలుస్తోంది. సో... పరిణితి చోప్రా #RRR సినిమాలో హీరోయిన్ అనేది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.