రామ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి 'ఇస్మాట్ శంకర్' టైటిల్ ని ఖరారు చేసి, రామ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ్ మాస్ లుక్, టైటిల్ కి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. ఈ ఇద్దరు హీరోయిన్లను పూరి ఫైనలైజ్ చేసేసాడని తెలుస్తోంది.
నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయిన నభా నతేష్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించనుంది. సవ్యసాచి చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన నిధి అగర్వాల్ ని ఓ హీరోయిన్ గా తీసుకున్నారట పూరి. సో.. ఇస్మార్ట్ శంకర్ కోసం నిధి అగర్వాల్, నభా నతేష్ రంగంలోకి దిగబోతున్నారు. మరి ఈ ఇద్దరితో శంకర్ రొమాన్స్ ఎలా ఉంటుందో వేచిచూద్దాం.