మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆరంభంకానుంది. కాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఈ పాత్రను ఓ స్టార్ హీరోతో చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. నిడివి తక్కువ పాత్ర అయినప్పటికీ, స్టార్ హీరోతో చేయిస్తే... సినిమాకి హైప్ పెరుగుతుందని ఆలోచిస్తున్నారట సుకుమార్. ఆ స్టార్ హీరో మెగా కాంపౌండ్ హీరో అయితే, ఇంకా ప్లస్ అవుతుందనుకుంటున్నారట. మరి సుక్కు ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో, వైష్ణవ్ తేజ్ కోసం ఏ స్టార్ హీరోని ఈ పాత్ర చేయడానికి సుకుమార్ ఒప్పిస్తాడో వేచిచూద్దాం.