సౌత్ సెలబ్రెటీల్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ చాలా కాస్ట్ లీ. ఓ నేషనల్ చానెల్ బయటపెట్టిన వార్త ఇది. 1300కోట్లుకు రాంచరణ్ అధిపతి అట. జూబ్లీహిల్స్ లోని రాంచరణ్ ఇల్లు 38కోట్లు విలువ చేస్తుందట. అపోలో హాస్పటల్స్ కి సంబంధించి చరణ్ కి దక్కిన ఆస్థి విలువ కొన్ని వందల కోట్లు ఉంటుందట. చరణ్ ఆస్థుల వివరాలు వెల్లడించిన ఓ నేషనల్ చానెల్ బయట పెట్టిన వివరాలు ఇవి. ఇదిలా ఉంటే...
ప్రస్తుతం 'సైరా' నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మిస్తున్న రాంచరణ్... టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న #RRR మల్టీస్టారర్ లో హీరోగా నటిస్తున్నాడు. 300కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సో... అటు కెరియర్ పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ లోనూ చరణ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.