'బాహుబలి' సినిమాలో నటించిన మెయిన్ క్యారెక్టర్స్ లుక్స్ ను విడుదల చేసే విషయంలో డైరెక్టర్ రాజమౌళి ఫాలో అయిన స్ట్రాటజీని ఎవ్వరూ మర్చిపోలేరు. మెయిన్ లీడ్స్ పుట్టినరోజు కానుకగా విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ లుక్స్ కోసం వర్కవుట్ చేసింది రాజమౌళి తనయుడు కార్తీకేయ. ఇప్పుడు ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ #RRR కి సంబంధించి ఫస్ట్ లుక్స్ ని డిజైన్ చేసే బాధ్యతను కూడా కార్తీకేయ తీసుకున్నాడట. కాగా ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల విషయంలో ఓ వార్త పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. అదేంటంటే...
రాంచరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చరణ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. కేవలం ఓ స్టిల్ రిలీజ్ చేస్తారా... లేక బాహుబలి టైప్ లో వీడియో విడుదల చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. సో... #RRR సినిమాకి సంబంధించి ఫస్ట్ విడుదలకాబోయేది రాంచరణ్ లుక్ అని ఫిక్స్ అయిపోవచ్చు.