న్యాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న #Nani24 చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు (18.2.2018) జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటికీ హీరోయిన్లు ఎవరనే విషయంలో క్లారటీ లేదు. త్వరలోనే హీరోయిన్ల గురించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. 5గురు స్ర్తీల జీవితాలతో ముడిపడివున్నహీరో స్టోరీ లైన్ తో ఈ సినిమా ఉంటుందట. ఇదిలా ఉంటే...
'ఆర్ ఎక్స్ 100' చిత్రం ద్వారా హీరోగా పరిచయమై ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కార్తీకేయ ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ చేయబోతున్నాడు. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చబోతున్నాడు.