యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ #RRR చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీని తర్వాత 40 రోజుల పాటు కోల్ కత్తాలో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసారట డైరెక్టర్ రాజమౌళి. ఈ భారీ షెడ్యూల్ లో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ పాల్గొనబోతున్నారని సమాచారమ్. అలాగే హీరోయిన్స్ కూడా ఈ 40 రోజుల షెడ్యూల్ లో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది.
కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి హీరోయిన్లు ఖరారైనట్టు తెలుస్తోంది. రాంచరణ్ సరసన అలియాభట్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అలియా భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. పారితోషికం విషయంలోనే ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే...
ఎన్టీఆర్ సరసన విదేశీ ముద్గుగుమ్మ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ ఫారిన్ భామను రాజమౌళి ఫైనలైజ్ చేసారని సమాచారమ్. ఆమె ఎవరనేది తెలియాలంటే చిత్రం యూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. రాముడు, రావణ టైప్ క్యారెక్టర్స్ లో చరణ్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. సో.. కోల్ కత్తా షెడ్యూల్ ఆరంభమైతేగానీ, హీరోయిన్ల విషయంలో నెలకొన్న సస్పెన్స్ కి తెరపడే అవకాశంలేదు.