View

బాస్ ఆఫ్ మాస్.. ఎన్టీఆర్ రేంజ్ అది!

Monday,May20th,2019, 06:35 AM

ఈ రోజు (20.5.2019) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. మే 20, 1983 లో జన్మించిన ఎన్టీఆర్ 36వ వసంతంలోకి అడుగుపెట్టాడు. బాలనటుడు నుంచి స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఎదిగిన వైనాన్ని ఎవరూ ప్రశంసించకుండా ఉండలేరు. బాల‌న‌టుడిగా 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర' (1991) చిత్రంలో తాత ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టించాడు. ఆ త‌ర్వాత 1996లో గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'బాల రామాయ‌ణం' చిత్రంలో రాముడిగా న‌టించి బాల‌న‌టుడిగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాడు.


ఆ రెండింటితో షేకాడించాడు
ఎన్టీఆర్‌ కెరీర్‌ని ఓసారి త‌ర‌చి చూస్తే ... 2001 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన 'నిన్ను చూడాలని' చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేసాడు ఎన్టీఆర్. హీరోగా కెరీర్ ప్రారంభించి రెండో ప్ర‌య‌త్న‌మే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో 'స్టూడెంట్ నంబ‌ర్ 1' (2001)లో న‌టించి సూప‌ర్‌హిట్ కొట్టాడు. ఆ త‌ర్వాత వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆది' సినిమాతో బాక్సాఫీస్‌ని రికార్డుల‌తో షేకాడించాడు. మాస్‌లో ఈ సినిమా బంప‌ర్ హిట్ కొట్టింది. ఆ త‌ర్వాత ఓ రెండు ప‌రాజ‌యాలు కెరీర్‌ని ఇబ్బందిపెట్టినా... మ‌రోసారి త‌న‌కి తొలి విజ‌యాన్ని ఇచ్చిన రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోనే 'సింహాద్రి' వంటి ఇండ‌స్ర్టీ హిట్‌తో ట్రాక్‌లోకి వ‌చ్చాడు. 2003లో రిలీజైన 'సింహాద్రి' బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 30 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. మాస్‌లో మాసివ్ హిట్ ఇది.


పరాజయాలను చవిచూసాడు
ఆ క్ర‌మంలోనే క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ పూరి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన 'ఆంధ్రావాలా' కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది. అలాంటి టైమ్‌లో త‌న‌కి అల‌వాటైన ద‌ర్శ‌కుడు వినాయ‌క్ సార‌థ్యంలో 'సాంబ' చిత్రంలో న‌టించాడు. ఆ సినిమా బ‌క్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్ గా నిలిచింది. 'న‌ర‌సింహా', 'అశోక్‌' వంటి ఫ్లాప్స్ తర్వాత 'రాఖీ' వంటి యావరేజ్ సినిమా చేశాడు. ఆ తర్వాత త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళితోనే ముచ్చ‌ట‌గా మూడో సినిమాలో న‌టించాడు. ఫాంట‌సీ, య‌మ‌లోకం బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కిన 'య‌మ‌దొంగ' కెరీర్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఆ క్ర‌మంలోనే మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'కంత్రి'తో మ‌రో ప‌రాజ‌యం. ఆ వెనువెంట‌నే త‌ను న‌మ్మే స్టార్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో 'అదుర్స్' చిత్రంలో న‌టించి కెరీర్‌లో కీల‌క‌మైన టైమ్‌లో హిట్ కొట్టాడు. ఈ సినిమాలో రెండు డిఫ‌రెంట్ గెట‌ప్పుల్లో క‌నిపించి ఎన్టీఆర్ మ్యాజిక్ చేశాడు. ఆ వెంట‌నే దిల్‌రాజు సంస్థానంలో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో 'బృందావ‌నం'తో మ‌రో క్లాసిక్ హిట్ కొట్టాడు. కెరీర్ పీక్స్‌లో మ‌రోసారి కుదుపు. వ‌రుస‌గా 'శ‌క్తి', 'ఊస‌ర‌వెల్లి', 'ద‌మ్ము' వంటి ప‌రాజ‌యాలు ఎన్టీఆర్‌ని పూర్తిగా బ్యాక్ ఫుట్ వేసేలా చేశాయి. ఈ ప‌రాజ‌యాల నుంచి త‌న‌ని తాను బైట‌ప‌డేసే ద‌ర్శ‌కుడి కోసం ఎంతో వేచి చూశాడు తార‌క్‌. ఆ టైమ్‌లోనే శ్రీ‌నువైట్ల 'బాద్‌షా' రూపంలో ఓ హిట్ ఇచ్చాడు. ఇక కుదురుకున్న‌ట్టే అనుకుంటున్న టైమ్‌లో వ‌రుస‌గా 'రామ‌య్యా వ‌స్తావయ్యా', 'ర‌భ‌స' ఫ్లాప్‌లు చిక్కుల్లోకి నెట్టాయి. స‌రిగ్గా అలాంటి టైమ్‌లో 'టెంప‌ర్' విజ‌యం త‌న‌కి పెద్ద అస్సెట్‌గా నిలిచింది.


బాస్ ఆఫ్ మాస్
దండ‌యాత్ర ..! ఇది ద‌యాగాడి దండ‌యాత్ర!! అంటూ ప‌వ‌ర్‌ప్యాక్డ్ డైలాగ్‌తో అభిమానుల్లో డిస్కషన్ పాయింట్ అయ్యాడు ఎన్టీఆర్‌. ఆ ఒక్క డైలాగ్‌తో మ‌రోసారి ఫ్యాన్స్‌లో హుషారు పెంచాడు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'టెంప‌ర్‌'తో మ‌రోసారి మాస్‌లో త‌న స్టామినా ఎలాంటిదో చూపించాడు ఎన్టీఆర్‌. బాస్ ఆఫ్ మాస్ అని ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. త‌న‌లోని అస‌లు సిస‌లు మాసిజం ఎలా ఉంటుందో 'ఆది', 'సింహాద్రి', 'టెంప‌ర్‌' వంటి చిత్రాల్లో చూపించాడు ఎన్టీఆర్‌. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌ లాంటి ఫ్లాప్ సినిమాల త‌ర్వాత కెరీర్‌కి కీల‌క‌మైన హిట్ 'టెంపర్'. ఎన్టీఆర్ స్టామినాను మరోసారి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించిందీ చిత్రం.


క్లాస్ మూవీతో 50కోట్ల క్లబ్
'నాన్నకు ప్రేమతో' అంటూ ఓ క్లాస్ మూవీ చేసి, తొలిసారి 50కోట్ల క్లబ్ లో చేరి తన సత్తా చాటుకున్నాడు. ఈ సక్సెస్ ని 'జనతాగ్యారేజి', 'జై లవకుశ', 'అరవిందసమేత వీరరాఘవ' చిత్రాలతో కొనసాగించాడు. ఈ సినిమాలన్నీ భారీ విజయాలను అందుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచాయి.


మల్టీస్టారర్ కి శ్రీకారం
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి ఈ యంగ్ టైగర్ ఎన్టీఆర్ #ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో మల్ఠీస్టారర్ కి శ్రీకారం చుట్టాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ స్థాయిని మరింతగా పెంచుతుందని ప్ర్యతేకంగా చెప్పక్కర్లేదు. ఇలా అంచెలంచెలుగా పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు దూసుకెళుతూ విజయాలను అందుకుంటున్న ఎన్టీఆర్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఫిల్మీబజ్ డాట్ కామ్ టీమ్ కోరుకుంటోంది.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !