సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రం యూనిట్ స్పెషల్ సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. ఈ 28న హైదరాబాద్ లో జరగనున్న ఈ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిధిగా ఏ హీరో రాబోతున్నాడనే ఆసక్తి అందరిలో ఉంది.
తాజా వార్తల ప్రకారం న్యాచులర్ స్టార్ నాని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా అటెండ్ అవ్వబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా అటెండ్ అయ్యాడు. ఇప్పుడు సక్సెస్ మీట్ కి నాని ముఖ్య అతిధిగా పాల్గొననుండటం విశేషం.