అఖిల్ అక్కినేని 4వ సినిమా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆ మధ్య గ్రాండ్ గా జరిగింది. తాజాగా అఖిల్ 5వ సినిమాకి కూడా రంగం సిద్ధమవుతోందట. ఆ వివరాల్లోకి వెళితే...
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన వన్ లైన్ స్టోరీ అఖిల్ ని చాలా ఇంప్రెస్ చేసిందట. దాంతో ఫుల్ స్ర్కిఫ్ట్ తో రావాల్సిందిగా ప్రశాంత్ వర్మకు అఖిల్ చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ స్ర్కిఫ్ట్ తయారు చేసే పనిలోనే బిజీగా ఉన్నాడట ప్రశాంత్ వర్మ. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారమ్. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారమ్.