View

వారికి నష్టం జరగకూడదని 'వాల్మీకి' టైటిల్ మార్చాం - హరీష్

Friday,September20th,2019, 04:44 AM

మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ప్లస్‌ బేనర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం 'వాల్మీకి'. పూజా హెగ్డే ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో అధర్వ మురళి కీలక పాత్ర పోషించారు. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె. మేయర్‌ సంగీతాన్ని అందించారు. ఈ రోజు (సెప్టెంబర్ 29) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా టైటిల్‌ను మార్చాల‌ని బోయ సంఘం, వాల్మీకి వ‌ర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ మేర‌కు చిత్ర యూనిట్ టైటిల్‌ను 'గ‌ద్ద‌లకొండ గ‌ణేశ్‌' గా మార్చింది. 


ఈ సంద‌ర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ - "వాల్మీకి టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి కొన్ని వర్గాల వారి నుండి నిరసనలు మొద‌ల‌య్యాయి. అప్ప‌టికీ మా టీమ్ న‌మ్మ‌కం ఏంటంటే వాల్మీకి మ‌హ‌ర్షి త‌ప్పు చేసిన‌ట్లు ఎక్క‌డా చూపించ‌లేదు కాబ‌ట్టి రేపు సినిమా చూసిన త‌ర్వాత డెఫ‌నెట్‌గా ఎవ‌రైతే నిర‌స‌న‌ను తెలియ‌జేశారో, వారి మ‌నోభావాలు దెబ్బ తిన్నాయ‌ని బాధ‌ప‌డుతున్నారో వారు సినిమాను చూసిన త‌ర్వాత క‌చ్చితంగా మ‌మ్మ‌ల్ని మెచ్చుకుంటార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం. అలాగే ఏమైనా అభ్యంత‌రాలుంటే సెన్సార్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌నుకున్నాం. సెన్సార్ స‌భ్యులు సినిమా చూశారు. వాల్మీకి మ‌హ‌ర్షి గురించి ఎక్క‌డా త‌ప్పుగా చెప్ప‌డం కానీ.. చూపించ‌డం కానీ లేదు కాబ‌ట్టి.. స‌గం ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయ్యింద‌ని అనుకున్నాం. అయితే బోయ‌సంఘంవారు, వాల్మీకి వ‌ర్గంవారు టైటిల్‌లో తుపాకీ ఉంద‌నే అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. దాన్ని మార్చాం. అనంత‌పురం, క‌ర్నూలు జిల్లా క‌లెక్ట‌ర్ ఆఫీస్ నుండి సినిమా రేపు రిలీజ్ అన‌గానే సినిమాను ఆపేయాలంటూ ఉత్త‌ర్వులు మాకు వ‌చ్చాయి. రేపు రిలీజ్ వ‌ర‌కు ఈ స‌మ‌స్య‌ను ఇంత వ‌ర‌కు ఎందుకు తీసుకొచ్చార‌నే భావ‌న అంద‌రి మ‌నుసుల్లో ఉంటుంది. ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాల‌ని నేను, మా నిర్మాత‌లు 14-15 గంట‌లు పాటు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాం. ఈ ప‌రిస్థితిని కావాల‌నే ఎవ‌రూ తెచ్చుకోరు. మేం ఓ మంచి టైటిల్‌ను పెట్టాం. ఇలాంటి టైటిల్‌ను పెట్ట‌డం ద్వారా వాల్మీకి మ‌హ‌ర్షి గొప్ప‌త‌నం తెలియ‌నివారికి కూడా తెలుస్తుంద‌ని అనుకున్నాం. 30-40 కోట్లు ఖ‌ర్చుపెట్టి 200 మంది టెక్నీషియ‌న్స్ ఈ సినిమాపై ప‌నిచేస్తూ ఓ వ్య‌క్తినో, వ‌ర్గాన్నో, కులాన్నో, ఓ సంఘాన్నో విమ‌ర్శించడానికి ఈ ప‌నిచేయ‌లేదు. వాల్మీకి మ‌హ‌ర్షి గురించి రెండు గొప్ప డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నా సినిమాలు చూడ‌ని మా నాన్న‌గారు కూడా తొలిసారి ఆయ‌న టైటిల్ అనౌన్స్ చేయ‌గానే.. చాలా మంచి టైటిల్ పెట్టావ‌ని ఫోన్ చేశారు. సినిమా ఎలా ఉందో తెలియ‌కుండా నేను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ చెప్పాలో అర్థం కావ‌డం లేదు. ఏ జిల్లాలో ఈ సినిమాను ఆపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారో దాని వ‌ల్ల అక్క‌డ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూట‌ర్స్ న‌ష్ట‌పోతారు. వారికి ఎలాంటి న‌ష్టం జ‌రగ‌కూడ‌ద‌ని భావించాం. నేను ముందు ఈ దేశ పౌరుడ్ని. త‌ర్వాతే డైరెక్ట‌ర్‌ని.. రైట‌ర్‌ని. ఏ వ్య‌క్తి కూడా ప్ర‌భుత్వానికి అతీతులు కాద‌ని న‌మ్మే వ్య‌క్తిని. సినిమాను చూడకుండా ఇంత డిస్ట్ర‌బ్ చేయ‌డమ‌నేది చిన్న బాధ‌ను క‌లిగిస్తుంది. అంద‌రికీ చెప్పేదొక్క‌టే 'వాల్మీకి' టైటిల్‌ను గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా ప‌రిగ‌ణించాల‌ని కోరుతూ టైటిల్‌ను మారుస్తున్నాం. ప‌బ్లిసిటీ మెటీరియ‌ల్ అంతా కొత్త టైటిల్‌తోనే ముందుకు వ‌స్తుంది. ఎవ‌రి మ‌నోభావాలైతే దెబ్బ‌తిన్నాయ‌న్నారో వారికి నేను స‌విన‌యంగా చెప్పేదొక్క‌టే వాల్మీకి సోద‌రులారా.. బోయ సోద‌రులారా మీరు నా సినిమాను చూడాల‌ని కోరుతున్నాను. సినిమా చూసిన త‌ర్వాత ఏదో మూల నిజ‌మే క‌దా! వాల్మీకి మ‌హర్షిని ఎక్క‌డా త‌ప్పుగా చూపించ‌లేదని మీ అంతరాత్మ‌కు అనిపిస్తే నాకు అదే చాలు. అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !