మాస్ రాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేటంటే...
ఈ సినిమాలోని ఐటమ్ పాట కోసం పాయల్ రాజ్ ఫుత్ ని తీసుకున్నారట. అయితే ఈ విషయంలో చిత్రం యూనిట్ సీక్రెన్సీ మెయింటెన్ చేస్తోందని తెలుస్తోంది. 'డిస్కోరాజా' సినిమా కోసం రవితేజతో జత కట్టింది పాయల్ రాజ్ ఫుత్. ఇప్పుడు మళ్లీ రవితేజ కోసం ఐటమ్ సాంగ్ చేయబోతోంది. ఇదిలా ఉంటే...
పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్స్ చేయనున్నాడని సమాచారమ్. విక్రమార్కుడు, కిక్ 2, వీర, దరువు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాల్లో డుయెల్ రోల్స్ చేసాడు రవితేజ. మరోసారి ఈ సినిమాలో డుయెల రోల్స్ లో అలరించనున్నాడు.