తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి మణి చందనకి బంపర్ ఆఫర్ తగిలింది. ఆ ఆఫర్ ఏంటనే విషయంలోకి వెళితే...
కొరటాల శివ దర్శకత్వంలో యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై పాన్ ఇండియా గా రూపొందుతోన్న సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తోంది. కాగా జాన్వికపూర్ తల్లిగా నటించే అవకాశం మణిచందనకు దక్కింది. ఇది బంపర్ ఆఫర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కడం పట్ల మణిచందన ఫుల్ హ్యాపీ అని తెలుస్తోంది.
అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఇప్పటికే రెండు షెడ్యూల్ లు పూర్తి చేసుకొంది.