యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'అరవింద సమేత' లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. #RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా ఇదే. ఈ సినిమా ఎన్టీఆర్ 30వ సినిమా కావడంతో #NTR30 అని సంభోదిస్తున్నాము. కానీ ఈ సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి రష్మిక మందన్నానని హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలు ప్రచారమవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే... ఎన్టీఆర్, రష్మిక జంట కనువిందు చేయబోతున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. దీనికి సంబంధించి చిత్రం యూనిట్ అఫిషీయల్ గా ప్రకటించాల్సి ఉంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ న్యూ ఇయర్ సందర్భంగా కలుసుకున్నారు. వారు చేయబోతున్న #NTR30 గురించి చర్చించుకుని ఉంటారు. ఈ యేడాది ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనుంది.