సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకక్కుతోన్న సందీప్ కిషన్ 25వ సినిమా 'ఏ 1 ఎక్స్ ప్రెస్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుదలయ్యింది. ఆసక్తికరంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఈ పోస్టర్లో సందీప్ కిషన్ ఎయిట్ ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని మరో చేతితో తన చొక్కాని స్టేడియంలో ఊపుతున్నట్లు చూపించారు. విజయం యొక్క ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ కి ఇది పర్ఫెక్ట్ ఫస్ట్‌లుక్ పోస్టర్.
ఇది 25వ సినిమా కావడంతో, ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలనితన కెరీర్ లో ఈ సినిమాకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉండాలని భావిస్తున్నాడు సందీప్ కిషన్. అందుకు తగ్గట్టు ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ కష్టాన్ని తెలియజేస్తోంది.
మరి ఈ సినిమా సందీప్ కిషన్ ని మరో మెట్టు ఎక్కేలా చేస్తుందేమో వేచిచూద్దాం.