పూజా హెగ్డె, రష్మిక మందన్నా... ఈ ఇద్దరూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా వార్తల ప్రకారం ఈ ఇద్దరినీ ఓ సినిమా కోసం పరిశీలిస్తున్నారట. తమ డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని, ఈ సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఈ ఇద్దరూ ట్రై చేస్తున్నారని సమాచారమ్. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా డైరెక్టర్ విక్రమ్ కుమార్.కె దర్శకత్వంలో 'థ్యాంక్ యూ' టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరు హీరోయిన్ల పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. ఓ హీరోయిన్ మెయిన్ లీడ్ అని తెలుస్తోంది. కాగా నిడివి తక్కువ ఉన్న హీరోయిన్ల పాత్ర కోసం అవికా గోర్, మాళవిక నాయర్ ని తీసుకున్నారట. మెయిన్ లీడ్ కోసం పూజా హెగ్డె, రష్మిక మందన్నాని పరిశీలిస్తున్నారట.
మరి ఈ ఇద్దరిలో 'థ్యాంక్స్' చెప్పే అవకాశం ఎవరికి వస్తుందో... ఎవరు నాగచైతన్యతో జతకడతారో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.