'గాడ్సే' టైటిల్ తో సత్యదేవ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదల చేసిన టైటిల్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ తెరకెక్కుతోన్న ఈ సినిమాకి హీరోయిన్ కన్ ఫార్మ్ అయ్యింది. ఆ హీరోయిన్ ఎవరంటే...
పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. 'గాడ్సే' తో తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతోంది. తెలుగులో అరంగేట్రం చేయడానికి ఇది సరైన సినిమా అని ఆమె భావిస్తోందట. ఇప్పటివరకూ చేయని భిన్న తరహా క్యారెక్టర్లో సత్యదేవ్ నటిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా పెర్ఫామెన్స్కి మంచి స్కోప్ ఉండే పాత్రలో నటిస్తోంది. మరి ఐశ్వర్య ఈ సినిమాతో టాలీవుడ్ లో నిలదొక్కుకుని మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుందేమో వేచిచూద్దాం.