బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ సినిమాల నిర్మాణంతో ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన AK Vs AK చిత్రంలో అతిథి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు బోనీకపూర్.
ఇప్పుడు నటుడిగా ఆయనకు బోల్డన్ని ఆఫర్లు వస్తున్నాయి. ఆ వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ అంగీకరించకుండా, సెలెక్టివ్ గా కొన్నింటిని అంగీకరిస్తున్నారు. అందులో భాగంగా ఓ సినిమాకి సైన్ చేసారు బోనీకపూర్. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...లవ్ రంజన్ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తండ్రిగా బోనీకపూర్ నటించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.