పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై 'సర్ధార్ గబ్బర్ సింగ్', 'చల్ మోహన్ రంగ' సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ పై మరో సినిమాని నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమాకి హీరో, డైరెక్టర్ కూడా ఫైనలైజ్ అయినట్టు సమాచారమ్. పూర్తి వివరాల్లోకి వెళితే...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ఓ సినిమా నిర్మించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడట. బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్యానర్ లో సినిమా చేయడానికి అబ్బాయ్ వరుణ్ తేజ్ కూడా రెడీగా ఉన్నాడట. పవన్ కళ్యాణ్ తో 'కాటమరాయుడు', 'గోపాల గోపాల' చిత్రాలకు దర్శకత్వం వహించిన డాలీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారమ్. ఇంకా ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారక ప్రకటన వెలువడే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్.