పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాద్ లో ఆరంభమయ్యింది. కాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం తమిళ్ హీరోని కన్ ఫార్మ్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తమిళ్ హీరో ఎవరంటే...
కోలీవుడ్ హీరో శివకార్తీకేయన్ ని తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్ రెడీ శివకార్తీకేయన్ కి ఈ సినిమాలోని పాత్ర గురించి క్రిష్ వివరించారట. తనకు ఈ పాత్ర నచ్చడంతో ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్విలిన్, మల్లూవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ లు హీరోయిన్లుగా నటించే అవకాశముందని సమాచారమ్.