ఎనర్జిటిక్ రామ్ హీరోగా రూపొందిన 'రెడ్' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' లాంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత రామ్ చేసిన సినిమా 'రెడ్'. 'ఇస్మార్ట్ శంకర్' అంతటి హిట్ 'రెడ్' అందుకోలేకపోయినప్పటికీ... కరోనా క్రైసెస్ లో కూడా రెవెన్యూ రాబడుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ... డైరెక్టర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది.
తాజా వార్తల ప్రకారం రామ్ నెక్ట్స్ సినిమా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఉండబోతోందని తెలుస్తోంది. రామ్ కోసం తన మార్క్ టచ్ తో ఫుల్ ఫన్ రైడ్ లా ఉండేలా ఓ స్ర్కిఫ్ట్ రెడీ చేసాడట అనిల్ రావిపూడి. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి రామ్ కూడా రెడీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాతో బిజీగా ఉన్నాడు అనిల్. ఈ సినిమా తర్వాత రామ్ తో అనిల్ రావిపూడి చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని సమాచారమ్.