మలయాళ సినిమా 'లూసిఫర్' తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. అదేంటంటే...
మలయాళ వెర్షన్ 'లూసిఫర్' లో హీరో మోహన్ లాల్ కి హీరోయిన్ ఉండదు. పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో చిరు సరసన హీరోయిన్ ఉంటుంది. నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు. ఈ మార్పు అవసరమని, చిరుకు హీరోయిన్ ఉండాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. అలాగే తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా స్ర్కిఫ్ట్ కు మార్పులు కూడా చేసారట డైరెక్టర్ మోహన్ రాజా. ఇదిలా ఉంటే...
జనవరి 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. రాంచరణ్, ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాలో రాంచరణ్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు.