ఆక్షన్, యాక్షన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అయిపోయాడు. 25 రోజుల పాటు జరగనున్న 'సర్కారు వారి పాట' రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (25.1.2021) నుంచి దుబాయ్ లో ఆరంభమయ్యింది. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలతో పాటు ఓ పాట చిత్రీకరణ కూడా జరగనుందని తెలుస్తోంది.
'గీత గోవిందం' లాంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. బ్యాంకింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆల్ రెడీ భారీ అంచనాలు నెలకొన్నాయి. తనదైన శైలిలో కామెడీ మిక్స్ చేస్తూ, మహేష్ బాబు స్టైల్ ను దృష్టిలో పెట్టుకుని స్ర్కిఫ్ట్ రెడీ చేసాడట డైరెక్టర్ పరశురామ్. ఖచ్చితంగా ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు పరశురామ్.
కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యస్.యస్.తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.