2021 ఆరంభంలోనే 'క్రాక్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న శృతిహాసన్ తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ రోజు (28.1) శృతిహాసన్ బర్త్ డే. ఈ సందర్భంగా తను కమిట్ అయిన సినిమా వివరాలు బయటికి వచ్చాయి. దాంతో అమ్మడు మంచి ఆఫర్ కొట్టేసిందని ఆమె ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ఇంతకీ శృతిహాసన్ ని వరించిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా...
డార్లింగ్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'సలార్'. ఈ సినిమా కోసం శృతిహాసన్ ని కథానాయికగా తీసుకున్నారు. శృతిహాసన్ ఈ సినిమాకి సైన్ చేయడం కూడా జరిగిపోయింది. ఈ సినిమా కోసం భారీ పారితోషికం కూడా అందుకుంటోందట శృతిహాసన్. సో... అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసినట్టేగా...!