సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా 'గీత గోవిందం' వంటి విజయాన్ని అందుకున్న డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. యస్.యస్.తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రోజు (29.1.2020) సినిమా విడుదలను చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'సర్కారు వారి పాట' సినిమా 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.
గతంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సూపర్‌స్టార్ మహేష్ చిత్రాలు 'ఒక్కడు' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'బిజినెస్‌మేన్' సెన్సేషనల్ హిట్టయ్యింది. 'సరిలేరు నీకెవ్వరు' సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇదే కోవలో 'సర్కారు వారి పాట' సినిమా కూడా 2022 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకోనుందో వేచిచూద్దాం.