మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ #RRR తో పాటు 'ఆచార్య' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నసంగతి తెలిసిందే. తాజాగా రాంచరణ్ 15వ సినిమా అప్ డేట్ బయటికి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనుంది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
జెంటిల్‌మేన్, ప్రేమికుడు, ఇండియన్, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, 2.0 వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ 15వ సినిమా తెరకెక్కనుంది. టాలీవుడ్లో సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలుగా ప్రెస్టీజియస్ మూవీగా భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందనుంది.
ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ తెలియజేస్తూ - ‘‘సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలవుతుంది. ఈ జర్నీలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి స్టార్ హీరోలతో, అప్ కమింగ్, డెబ్యూ హీరోలతో, దర్శకులతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయే చిత్రాలను రూపొందించాం. ఇప్పుడు మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకమైన 50వ సినిమాను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గారితో నిర్మిస్తున్నాం. ఆయన హీరోగా నటిస్తున్న 15వ చిత్రమిది. దక్షిణాది సినిమా స్థాయిని ఇటు సబ్జెక్ట్ పరంగా, అటు సాంకేతికంగా నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లిన భారీ చిత్రాల సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను మా బ్యానర్లో నిర్మించనున్నాం. చరణ్, శంకర్ వంటి క్రేజీ కాంబినేషన్లో ప్యాన్ ఇండియా మూవీ అంటే.. సినిమాపై ఎలాంటి భారీ అంచనాలుంటాయో అర్థం చేసుకోవచ్చు. సినీ ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈ ప్యాన్ ఇండియా మూవీని రూపొందిస్తాం. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.