'ఆచార్య' సినిమా నుంచి తప్పుకుంటున్నాను. క్రియేటివ్ డిఫరెన్సస్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని హీరోయిన్ త్రిష 'ఆచార్య' సినిమా నుంచి తప్పుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఆచార్య' నుంచి త్రిష తప్పుకోవడం అప్పట్లో హాట్ టాఫిక్ అయ్యింది. అయితే తాజాగా చిరు సినిమాలో త్రిష నటించబోతోందనే వార్త హల్ చల్ చేస్తోంది. దాంతో ఈ వార్తలో ఎంతవరకూ నిజముందనే విషయం తెలీక జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకీ చిరు నటించబోతున్న ఏ సినిమా కోసం త్రిష రంగంలోకి దిగబోతుందో తెలుసా...
మలయాళ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రీమేక్ కోసం చాలా మార్పులు చేసారట. ఈ మార్పుల్లో భాగంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుందట. ఈ హీరోయిన్ పాత్రను ముందుగా నయనతారతో చేయించాలనుకున్నారట. తాజాగా త్రిషను సంప్రతించారని, ఈ రీమేక్ లో నటించడానికి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే. తెలుగు రీమేక్ కి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు.