బాబాయ్ వెంకటేష్ మర్డర్ మిస్టరీ కోసం అబ్బాయ్ రానా రంగంలోకి దిగుతున్నాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ వెంకీ చేస్తున్న మర్డర్ మిస్టరీ సినిమా ఏంటీ అనుకుంటున్నారా...
బ్లాక్ బస్టర్ హిట్ సినిమా 'దృశ్యం' కి సీక్వెల్ గా హీరో వెంకటేష్ 'దృశ్యం 2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే రానా ఓ పాత్ర చేస్తున్నాడట. క్యామియో రోల్ అయినప్పటికీ, బాబాయ్ సినిమాలో అబ్బాయ్ కనిపిస్తే... దగ్గుబాటి అభిమానులకు పండగలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. వెంకీ సరసన మీనా నటిస్తోంది. మలయాళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ 'దృశ్యం 2' కి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ వెర్షన్ 'దృశ్యం 2' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. తెలుగు వెర్షన్ కూడా అదే రేంజ్ విజయాన్ని అందుకుంటుందనే అంచనాలు అందరికీ ఉన్నాయి. తెలుగు నెటివిటీకి తగ్గట్టు స్ర్కిఫ్ట్ లో కొన్ని మార్పులు కూడా చేసారట. సో... 'దృశ్యం 2' కోసం బాబాయ్ తో అబ్బాయ్ స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నాడన్నమాట...!