స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్ని), రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయా... డిష్యుం డిష్యుం అనుకుంటున్నారా... అదేం లేదండి. అల్లు అర్జున్ సినిమాలో మంచు మనోజ్ నెగటివ్ షేడ్ రోల్ చేయబోతున్నాడట. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలీదుకానీ, ఈ వార్త నిజమైతే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అసలు విషయంలోకి వెళితే...
అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమాకి విలన్ ప్రాబ్లమ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి విలన్ గా కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు విజయ్ సేతుపతి. అప్పట్నుంచి ఈ సినిమాకి విలన్ ని సెట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. మాధవన్, ఆర్య, సముద్రఖని.. ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. కానీ వారెవ్వరూ ఫైనలైజ్ అవ్వలేదు. తాజా వార్తల ప్రకారం మంచు మనోజ్ ని 'పుష్ప' కోసం విలన్ గా తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 'వేదం' సినిమా కోసం అల్లు అర్జున్, మనోజ్ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు 'పుష్ప' సినిమాలో మంచు మనోజ్ కన్ ఫార్మ్ అయితే, రెండోసారి అల్లు హీరో, మంచు హీరో స్ర్కీన్ షేర్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు.
సో... లెటజ్ వెయిట్ ఫర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్.