మిల్క్ బ్యూటీ తమన్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి షాపింగ్ చేయడమేంటీ... అసలు ఈ ఇద్దరూ కలిసి ఎందుకు షాపింగ్ చేసారు అని తెలుసుకోవాలని ఉందా...
అయితే ఈ మ్యాటర్ చదివేయండి.మహేష్ బాబు, తమన్నా కలిసి ఓ ప్రముఖ హోమ్ అప్లియెన్స్, ఎలక్ర్టానిక్స్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాండ్ కి సంబంధించిన షూటింగ్ లో ఈ రోజు పాల్గొంటున్నారు మహేష్ బాబు, తమన్నా. సందీప్ వంగా ఈ కమర్షియల్ యాడ్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కమర్షియల్ యాడ్ షూటింగ్ కాన్సెఫ్ట్ లో భాగంగానే తమన్నాతో కలిసి మహేష్ బాబు ఆ ప్రముఖ బ్రాండ్ కోసం షాపింగ్ చేస్తాడట. ఈ నెలాఖరు నుంచి ఈ యాడ్ టివిల్లో ప్రసారం కానుందని తెలుస్తోంది.
'ఆగడు' సినిమా కోసం జత కట్టారు మహేష్ బాబు, తమన్నా. ఆ తర్వాత మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ బాబు, తమన్నా ఓ ప్రముఖ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి జత కట్టారు.