యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత తెరకెక్కనున్న #NTR30 చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. మరో వైపు #NTR31 కి కూడా రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీకి పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చారట. ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేయాల్సిందిగా కోరారట. ఎన్టీఆర్ ని మెప్పించే కథతో అట్లీ స్ర్కిఫ్ట్ రెడీ చేస్తే, భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించడానికి నిర్మాత అశ్వనీదత్ రెడీగా ఉన్నారని సమాచారమ్. పక్కా మాస్ సినిమాలను తెరకెక్కించగల సత్తా ఉన్న డైరెక్టర్ అట్లీ, ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయితే... బొమ్మ దద్ధరిల్లడం ఖాయం. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా వేచిచూద్దాం.