సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్ కంటెంట్ తో దూసుకుపోతుంది. ఇప్పుడా అంచనాలని మరో స్థాయికి తీసుకెళ్లింది సర్కారు వారి థియేట్రికల్ ట్రైలర్.
బ్రమరాంభ థియేటర్ లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు, చిత్ర దర్శకుడు పరశురాం మిగతా టీం సభ్యులుపాల్గొని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల కేరింతల మధ్య ట్రైలర్ ని విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా సర్కారు వారి పాట అని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. హైవోల్టేజ్ యాక్షన్,. గ్రాండ్ విజువల్స్.... మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట ట్రైలర్.
నా ప్రేమని దొంగిలించగలవు.. నా స్నేహాన్నీ దొంగిలించగలవు.. యూ కాన్ట్ స్టీల్ మై మనీ.. - ఈ డైలాగ్తో మహేష్ బాబు క్యారెక్టర్ ని పరిచయం చేయడం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ మూమెంట్ తెచ్చింది.
అప్పనేది ఆడపిల్ల లాంటిది సార్.. ఇక్కడెవరూ బాధ్యత గల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు అని మహేష్ పాత్ర చెప్పడం నా దృష్టిలో అప్పనేది సెటప్ లాంటిది.. అని విలన్ సముద్రఖని అనడం.. కథ లో హై వోల్టేజ్ కాన్ ఫ్లిక్ట్ తెలియజేస్తుంది.
ఓ వంద వయగ్రాలు వేసి శోభనం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు.. మహేష్ పలికిన ఈ డైలాగ్ వీర లెవల్ మాస్ గా విజిల్స్ కొట్టించింది.
ట్రైలర్ లో మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. అదే సమయంలో మాస్ యాక్షన్ తో అదరగొట్టారు. దర్శకుడు పరశురాం మహేష్ బాబుని సరికొత్తగా చూపించి అభిమానులని అలరించారు. మహేష్ బాబు కీర్తి సురేష్ జోడి లవ్లీగా వుంది.
టెక్నికల్ గా సర్కారు వారి పాట అత్యన్నత స్థాయిలో వుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ఎస్ థమన్ ట్రైలర్ కోసం చేసిన బీజీఏం స్కోర్ గ్రాండ్ వుంది. విజువల్స్ లావిష్ గా వున్నాయి. సర్కారు వారి పాట ట్రైలర్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తిని ఇంకా పెంచేసింది.
మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.