View

పరుచూరి వారసుడు హీరోగా ‘సిద్ధాపూర్‌ అగ్రహారం’ ప్రారంభోత్సవం

Saturday,June11th,2022, 12:50 PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితలుగా పరుచూరి బద్రర్స్‌ ఎంత సుప్రసిద్ధులో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి పరుచూరి సుదర్శన్‌ (పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు)హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ‘సిద్ధాపూర్‌ అగ్రహారం’ అనే టైటిల్‌ ఖరారు చేసుకున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వాసు తిరుమల, ఉష శివకుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాకేష్‌ శ్రీపాద దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ప్రముఖ దర్శకులు బి. గోపాల్‌ క్లాప్‌ ఇవ్వగా, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందజేశారు. ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్‌ కెమెరా స్విచ్చాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ఇతర ప్రముఖ దర్శకులు వీఎన్‌ ఆదిత్య , వీరూ పొట్ల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏ రైతైనా తన కొడుకు చేతికి నాగలి ఇవ్వాలనుకుంటాడు. మా నాన్నగారు అలానే అనుకున్నారు కానీ మేం కలం పట్టుకున్నాం. నా కొడుకు రవీంద్రనాథ్‌ కూడా కలంపట్టుకున్నాడు. కానీ మనవడు పరుచూరి సుదర్శన్‌ హీరోగా క్లాప్‌ కొట్టించుకున్నాడు. సుదర్శన్‌ హీరోగాపరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంత గొప్ప విద్యావంతుడికైనా వినయం లేకపోతే అతని విద్య శోభించదు. అలాగే గర్వం మనల్ని వెనక్కి లాగుతుంది. 'సిద్ధాపూర్‌ అగ్రహారం’ టైటిల్‌లోనే సిద్ధా అని ఉంది. సిద్ధ అంటే సిద్ధం అని అర్థం. సిద్ధాపూర్‌ అగ్రహారం చిత్రం సుదర్శన్‌కు యాక్టర్‌గా మంచి జీవితాన్ని ప్రసాదించాలి. అలాగే సుదర్శన్‌ ఇండస్ట్రీలో అద్భుతమైన కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ పెద్దలు, ప్రేక్షకులు సుదర్శన్‌ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.ఈ సినిమా విడుదల తర్వాత చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరిపేరు ప్రేక్షకులందరకీ తెలిసేలా ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘ప్రతిధ్వని’ చిత్రంలో నేను రాజకీయం గురించి ఓ డైలాగ్‌ చెప్పాను. ఇప్పుడు సుదర్శన్‌ ఆ డైలాగ్‌ చెబుతుంటే నాకు ఒళ్లు పులకరించి పోతుంది. అన్నగారి ఎత్తు (ఎన్టీఆర్‌), సుదర్శన్‌ ఎత్తు ఒకటే. ఆయన అంత స్థాయికి ఎదిగే ప్రయత్నం సుదర్శన్‌ చేయాలని, చాలా కష్టపడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.


అతిథిగా పాల్గొన్న ప్రముఖ దర్శకుడు బి. గోపాల్‌ మాట్లాడుతూ – ‘‘పరుచూరి బ్రదర్స్‌ నాకు దర్శకుడిగా లైఫ్‌ ఇచ్చారు. రవీంద్రనాథ్‌ కూడా మంచి అబ్బాయి. నా బిడ్డలాంటివాడు(సుదర్శన్‌ను ఉద్దేశిస్తూ..) హీరో అవుతు న్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా టైటిల్‌నే పవర్‌ ఉంది. సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు.
అతిథిగా పాల్గొన్న మరో ప్రముఖ దర్శకుడు వీరూ పొట్ల మాట్లాడుతూ – ‘‘పరుచూరి బ్రదర్స్‌గారి దగ్గరపనితో పాటు వ్యక్తిగా ఎలా ఉండాలో కూడా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో అన్ని రకాలుగా సుదర్శన్‌కు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో సుదర్శన్‌ మాట్లాడుతూ – ‘‘నేను హీరో అవుదామని అనుకోలేదు. కానీ దర్శకుడు కథ చెప్పిన విధా నం నాకు బాగా నచ్చింది. యాక్టర్‌గా మంచి సినిమాలు తీయాలని అనుకుంటు న్నాను.‘సిద్ధాపూర్‌ అగ్ర హారం’ మంచి సినిమా అవుతుందనీ, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.


దర్శకుడు రాకేష్‌ మాట్లాడుతూ– ‘‘పరుచూరి బ్రదర్స్‌ నాకు ఎంతో స్ఫూర్తి. సిద్ధాపూర్‌ అగ్రహారం సినిమా హిట్‌ సాధిస్తుంది. ప్రీ రిలీజ్, విజయోత్సవంలో మరిన్ని విషయాలను మాట్లాడతాను’’ అన్నారు.


నిర్మాతలు వాసు తిరుమల, ఉష శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో రూపొందుతోన్న రెండో సినిమా ఇది. సుదర్శన్‌ను మా బ్యానర్‌లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు లక్కీగా ఫీల్‌ అవుతున్నాం. దర్శకుడు రాకేష్‌ గారు చాలా కష్టపడ్డారు. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.


మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనీష్‌ రాజ్‌ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ– ‘‘దాదాపు రెండున్నర సంవత్సరాలుగా దర్శకుడు రాకేష్‌ ఈ సినిమాపై వర్క్‌ చేస్తున్నాడు. పరుచూరి బ్రదర్స్‌గార్లు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం’’ అన్నారు.


ఈ కార్యక్రమంలో రైటర్‌ వై. అనుదీప్, కెమెరామేన్‌ శివారెడ్డి సవనమ్‌ మాట్లాడారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో సాగర్.కె.చంద్ర దర్ ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Dr. Mohanbabu Starrer Son of India Movie Teaser

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

Read More !