అఖిల్ అక్కినేని 3వ సినిమా 'మజ్ను' ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. త్వరలోనే అఖిల్ 4వ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకి డైరెక్టర్, స్టోరీ లైన్ కన్ ఫార్మ్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి పెద్ద కొడుకు సత్య పినిశెట్టి ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ ని అఖిల్ కి ఎప్పుడో వినిపించాడు. గత కొన్నాళ్లుగా ఈ స్టోరీకి సంబంధించి అఖిల్, సత్య మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఈ స్టోరీ అఖిల్ కి బాగా నచ్చడంతో సత్య పినిశెట్టి దర్శకత్వంలో సినిమా చేయాలనే ఆలోచనలో అఖిల్ ఉన్నాడట. ఇప్పుడు ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి నాగార్జున సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ నగర్ టాక్.