అక్కినేని అఖిల్ ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో చాక్లెట్ బాయ్ లుక్ లోనే కనిపించాడు. ఇందుకు పూర్తి భిన్నంగా రఫ్ లుక్ లో అఖిల్ కనిపిస్తే... ఎలా ఉంటాడో తన కొత్త సినిమా పోస్టర్ ని చూస్తే అర్ధమవుతోంది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి అఖిల్ లుక్, టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేసారు. మాస్ లుక్ తో అఖిల్ అదిరిపోయాడు. పెంచిన జుత్తు, గెడ్డం, సిగరెట్ కాల్చుతూ రఫ్ అండ్ టఫ్ గా ఉన్న అఖిల్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి 'ఏజెంట్' టైటిల్ ని ఖరారు చేసారు. టోటల్ గా అఖిల్ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని అర్ధమవుతోంది. స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ చేసాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 11 నుంచి ఆరంభంకానుంది. డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగా థియేటర్స్ కి రానుంది.
యస్.యస్.తమన్ సంగీతం సమకూర్చబోతున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ స్టోరీ ఇచ్చారు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటించనుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.