స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఇకపై అందరూ ఐకాన్ స్టార్ అనే బిరుదుతో పిలుస్తారు. ఎందుకంటే 'పుష్ప' టీజర్ లో స్టైలిష్ స్టార్ అనే టైటిల్ ని కొట్టేసి, ఐకాన్ స్టార్ అని వేసారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పుష్ప' టీజర్ ను కొద్దిసేపటి క్రితం చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ మాములుగా లేదు. అందరి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా, అల్లు అర్జున్ ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రజెంట్ చేసిన విధానం వావ్ అనిపించేలా ఉంది.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో స్మగ్లర్ పుష్పగా అల్లు అర్జున్ మేకోవర్ మాములుగా లేదు. కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, లుక్ పరంగా డైరెక్టర్ సుకుమార్ ఎంత కేర్ తీసుకున్నారో టీజర్ చూస్తేనే తెలుస్తోంది. సింగిల్ డైలాగ్ తో టీజర్ కట్ చేసినప్పటికీ, కిక్ ఇచ్చే విధంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్ ఉండటం సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. 'రంగస్థలం' లో రాంచరణ్ పాత్రకు వినికిడి లోపం అయితే, 'పుష్ప' లో అల్లు అర్జున్ కి చేతి భుజం కొంచెం డిఫెక్ట్ ఉన్నట్టు చూపించడం జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నైట్ ఎఫెక్ట్ విజువల్స్ తో 'పుష్ప రాజ్' పరిచయం అదిరిపోయింది. సుకుమార్ మార్క్ కనిపించింది.