యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెకక్కుతోన్న #RRR (వర్కింగ్ టైటిల్) చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రాంచరణ్ పాల్గొనగా ఓ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ మల్టీస్టారర్ లో కూడా 'బాహుబలి' లో చేసిన ప్రయోగాన్ని చేస్తున్నారట రాజమౌళి. అదేంటంటే...
#RRR లో ట్రైబల్ కి సంబంధించి ఏ ఎపిసోడ్ ఉందట. ఈ ఎపిసోడ్ కోసం ఓ భాషను వాడాలనుకుంటున్నారట రాజమౌళి. 'బాహుబలి' లో 'కిలికి' అంటూ కొత్త భాషను పరిచయం చేసారు రాజమౌళి. ఇప్పుడు #RRR లో కూడా ఓ కొత్త భాషను వాడబోతున్నారట. పీరియాడికల్ చిత్రం కావడంతో అప్పుడు ట్రైబల్స్ ఏ భాష మాడ్లాడేవారు, ఇప్పుడు ట్రైబల్స్ మాట్లాడుతున్న భాష... ఇవన్నిపరిగణనలోకి తీసుకుని ఈ ఎపిసోడ్ కి డైలాగ్స్ రాయించాలనుకుంటున్నారట. అందులో భాగంగా ఓ కొత్త భాషను పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సో.. బాహుబలి కోసం వాడిన 'కిలికి' భాష వర్కవుట్ అయినట్టే, #RRR కోసం వాడబోతున్న భాష కూడా వర్కవుట్ అవుతుందేమో వేచిచూద్దాం.