బిగ్ బాస్ 4 సీజన్ కంటెంటెస్ట్ అరియానా కి ఈ షో తర్వాత ఎంత పాపులార్టీ పెరిగి పోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆమెకు బోల్డన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఆ ఆఫర్లను చక్కగానే క్యాష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతోంది అరియానా.
తాజాగా ఈ బుట్టబొమ్మని ఓ సినిమా ఆఫర్ వరించింది. మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కళ్యాణ్ దేవ్ సోదరిగా నటించే అవకాశం అరియానాకి దక్కింది. రైటర్ శ్రీధర్ సీపానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరో సోదరి పాత్రకు ఇంపార్టెంట్స్ ఉందట. ఈ నేపధ్యంలో అరియానా అయితే ఈ పాత్రకు బాగుంటుందని డైరెక్టర్ శ్రీధర్ సీపానా భావించారట. తనకు కూడా ఇది మంచి ఆఫర్ గా భావించిన అరియానా ఈ సినిమాకి సైన్ చేసిందట. ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో కూడా అరియానా నటించనుంది.
సో... అమ్మడికి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. మరి ఈ ఆఫర్లను ఎంత వరకూ క్యాష్ చేసుకుని నటిగా నిలదొక్కుకుంటుందో వేచిచూడాల్సిందే.