'ఖైదీ నెం.150' చిత్రంతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి, భారీ సక్సెస్ ని చవిచూసారు మెగాస్టార్ చిరంజీవి. 151వ చిత్రంగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించడానికి సమాయత్తమవుతున్నాడు చిరు. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే ని పురస్కరించుకుని ఈ సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమం జరిపి, సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.
అయితే తాజా వార్తల ప్రకారం ఈ సినిమా విషయంలో రాంచరణ్ ప్లాన్ మరోలా ఉందని తెలుస్తోంది. సినిమా ప్రారంభించడానికి ముందు అన్నీ పర్ ఫెక్ట్ గా పూర్తి చేయాల్సిందిగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' టీమ్ కి చెప్పాడట. ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా పూర్తి చేస్తేనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని రాంచరణ్ ఫిక్సయ్యాడట. అందుకే ఈ సినిమా ప్రారంభం లేట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని వార్తల ప్రకారం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ముందు సోషల్ డ్రామాతో చిరు ఓ సినిమా చేసే అవకాశముందని కూడా తెలుస్తోంది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా ఆరంభమైతే మరో సినిమా గురించి ఆలోచించే అవకాశంలేదు. ఈ సినిమా కోసం ఎక్కువ నెలలు కేటాయించాల్సి వస్తుంది. అందుకే 'ఉయ్యాలవాడ..' ముందు చిరు మరో సినిమా చేసే దిశగా ఆలోచిస్తున్నారని ఊహించవచ్చు. ఏదేమైనా మెగా కాంపౌండ్ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే క్లారటీ వస్తుంది. ఆ ప్రకటన కోసం ఎదురుచూద్దాం.