సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు (9.8.2020) 'సర్కారు వారి పాట' చిత్రం యూనిట్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే...
ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ పి.యస్.వినోద్ తప్పుకున్నారు. 'శ్రీమంతుడు', 'సాహో' సినిమాటోగ్రాఫర్ మది 'సర్కారు వారి పాట' సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న ప్రకారం జరగలేదు. దాంతో పి.యస్.వినోద్ ముందు కమిట్ మెంట్స్ ప్రకారం ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నారట. అందుకే ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను మది రీప్లేస్ చేయబోతున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన అనంతరం ఈ సినిమా షెడ్యూల్ ని ఆరంభించడానికి చిత్రం యూనిట్ ప్లాన్ చేస్తోందట. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.