నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూడో సినిమా ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ లైన్, బాలయ్య రెండు పవర్ ఫుల్ పాత్రలతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
తాజా వార్తల ప్రకారం ఈ సినిమాకి ఓ హీరోయిన్ సెట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. శాండిల్ వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ ని ఓ హీరోయిన్ గా తీసుకోవడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆల్ మోస్ట్ ఈ ముద్దుగుమ్మ కన్ ఫార్మ్ అయినట్టేనని తెలుస్తోంది. శ్రధ్ధా శ్రీనాధ్ తెలుగు ఆడియన్స్ కి పరిచయస్థురాలే. మణిరత్నం 'చెలియా' చిత్రంలో గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చింది. నాని 'జెర్సీ' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సో... బాలయ్య, బోయపాటి సినిమాకి ఓ హీరోయిన్ కన్ ఫార్మ్ అయినట్టేనని ఫిక్స్ అయిపోవచ్చు.