కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో చిత్ర పరిశ్రమ లాక్ డౌన్ మోడ్ లో ఉంది. థియేటర్స్ బంద్ అయిపోయాయి. ఎప్పుడు థియేటర్స్ తెరుచుకుంటాయి... తెరుచుకున్న తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనే దానిపై చిత్ర పరిశ్రమ ఆందోళనలో ఉంది. ఈ నేపధ్యంలో కొంతమంది చిన్న నిర్మాతలు ఓటిటి ఫ్లాట్ పామ్ పై తమ సినిమాని విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం ఓటిటి ఫ్లాట్ పామ్ వైపు అడుగులు వేయడానికి డిసైడ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో విడుదలకు నోచుకోలేదు. ఈ నేపధ్యంలో 'వి' చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేయడానికి దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో 33కోట్లు ఇచ్చి 'వి' సినిమా డిజిటల్ రైట్స్ ని దక్కించుకుందని సమాచారమ్. హీరో నాని, డైరెక్టర్ ఇంద్రగంటి కూడా ఓటిటి లో సినిమాని విడుదల చేయడానికి యస్ చెప్పారట. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ర్కీనింగ్ చేయడానికి సమాయత్తమవుతున్నట్టు వినికిడి. ఏదేమైనా మేకర్స్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
సో... చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేద్దాం. ఇదే కనుక నిజమైతే ఓ పెద్ద సినిమా ఓటిటి లో స్ర్కీనింగ్ అవుతున్నట్టే అని చెప్పొచ్చు. మరి రెస్పాన్స్ ఎలా ఉంటుందో వేచిచూద్దాం.