'ఆచార్య' సినిమాతో పాటు మలయాళ హిట్ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించడానికి మెగాస్టార్ చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది కాకుండా మరో రీమేక్ లో నటించడానికి చిరు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.
తమిళంలో అజిత్ హీరోగా రూపొందిన 'వేదాళం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి చిరు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ తెలుగు రీమేక్ కి తుది మెరుగులుదిద్దే పనులను డైరెక్టర్ మెహర్ రమేష్ కి అప్పజెప్పారట. కాగా తాజా వార్తల ప్రకారం ఈ సినిమా తెలుగు రీమేక్ ను నిర్మించే బాధ్యత క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్.రామారావుకు అప్పజెప్పారని సమాచారమ్.
సో... అన్ని కుదిరితే చాలా యేళ్ల తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో చిరు సినిమా చేసే అవకాశం ఉంటుంది. అలాగే 'షాడో' తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ సినిమా చేయలేదు. ఏకంగా మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఈ రీమేక్ ద్వారా దక్కుతుందని చెప్పొచ్చు.