తనతో కలిసి నటించిన ఓ హీరోయిన్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డాడని వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ హీరోయిన్ వరుణ్ తేజ్ కంటే సీనియర్ హీరోయిన్ అని కూడా వార్తలు వచ్చాయి.
అయితే వరుణ్ తేజ్ కానీ, మెగా కుటుంబంకానీ ఈ వార్తలపై స్పందించలేదు. అలాగని ఈ వార్తలను కూడా ఖండించలేదు. సదురు హీరోయిన్ వైపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. దాంతో వరుణ్ తేజ్ ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని, అందుకే ఈ వార్తలను ఖండించడంలేదని. కామ్ గా ఉంటున్నారని జనాలు మాట్లాడుకుంటున్నారు. నిహారిక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లికి సంబంధించి అధికారికంగా వెల్లడించే అవకాశముందని కూడా చెప్పుకుంటున్నారు.
సో... త్వరలో వరుణ్ తేజ్ కూడా ఓ ఇంటివాడవుతాడేమో వేచిచూద్దాం.